కరీంనగర్ క్రిష్ణ నగర్ లో కార్టన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నాడు పోలీసులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు ఉదయం 5:30 గంటల నుండి 7 30 గంటల వరకు ప్రతి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

Update: 2020-02-25 06:13 GMT

కరీంనగర్ టౌన్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నాడు పోలీసులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు ఉదయం 5:30 గంటల నుండి 7 30 గంటల వరకు ప్రతి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ డిసిపి ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం కోసం ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ ప్రాంతం శివారులో ఉన్నందున నేరస్తులు తలదాచుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. అద్దేదారుల్లో వివరాలను తెలుసుకొని ఇళ్లను అద్దెకు ఇవ్వాలని సూచించారు. అద్దెదారుల వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందించినట్లయితే నిమిషాల వ్యవధిలో వారికి సంబంధించిన వివరాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు.నేరాల ఛేదనలో సిసికెమెరా పాత్ర కీలకమైంది అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గ్రామస్తులను అభినందించారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని వివిధ రకాలకు చెందిన 208 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసిపి విజయసారధి, ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిని నీటికపంత్, ఇన్స్పెక్టర్లు తుల శ్రీనివాసరావు, మహేష్ గౌడ్, సంతోష్ కుమార్, ఆర్ఐ లు మల్లేశం, జానిమియా, శేఖర్ ఎస్ఐ లు శ్రీనివాస రావు, చంద్రశేఖర్, ఎల్లయ్య గౌడ్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు.


Tags:    

Similar News