కరోనా వైరస్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసుల అవగాహన

Update: 2020-03-20 16:30 GMT

పాయకరావుపేట: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, ప్రజలలో అవగాహన కల్పించడానికి ఆటో రిక్షాలకు మైక్ లు అమర్చి వివిధ గ్రామాలలో శుక్రవారం ప్రచారం నిర్వహిస్తున్నామని ట్రయినీ డిఎస్పీ కిషోర్ కుమార్ మహంతి తెలిపారు. కరోనా వైరస్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఈ ప్రచారం ద్వారా తెలియపరుస్తున్నారు.

ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలిపిన సూచనలు పాటించాలని, సాధ్యమైనంత వరకూ ప్రజలు ఇళ్ళకే పరిమితమవ్వాలని, జనం గుంపులుగా గుమిగూడి ఉండరాదని, చేతులను తరుచూ శుభ్రం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తదితర సూచనలతో ప్రచారం నిర్వహిస్తున్నారు.

అనారోగ్య లక్షణాలు కన్పించగానే అశ్రద్ద చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రంకి వెళ్ళాలని తెలుపుచున్నారు. మరీ ముఖ్యంగా కరోనా వ్యాధి పట్ల వదంతులు, పుకార్లు నమ్మవద్దని , ప్రభుత్వాధికారులు, పోలీసుల నుండి వచ్చిన సమాచారాన్ని మాత్రమే ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఎస్ ఐ విభీషణరావు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News