య‌జ‌మాని కోసం తాచుపాముతో పోరాటం..చివ‌ర‌కు..

Update: 2020-04-13 04:03 GMT

 ఓ పెంపుడు కుక్క తనను అల్లారుముద్దుగా పెంచిన యజమానిని ప్రమాదం నుంచి కాపాడి తన ప్రాణాలు విడిచింది. విష సర్పంతో పోరాడి యజమానిని రక్షంచిన శునకం ఈ క్రమంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ పరిధిలోని గోపాలకుంటలో  జరిగింది. శునకం యజమాని కిశోర్‌ తన ఇంటిలోని గదిలో శనివారం సాయంత్రం నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఆయన మంచం కిందకు ఓ తాచుపాము చేరింది. దానిని గమనించిన అతని పెంపుడు కుక్క స్నూపి అరుస్తూ యజమానిని నిద్రలేపింది.

కిశోర్‌ నిద్ర లేచేసరికి అతన్ని కాటు వేసేందుకు పాము రాగా వెంటనే కుక్క దాన్ని అడ్డుకుని నోటితో పట్టుకుంది. ఒత్తిడికి గురైన పాము స్నూపిని కాటేసింది. అయినా కూడా స్నూపి లెక్కచేయకుండా పామును ఇంటి నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. అనంత‌రం కిషోర్ కర్రతో పామును చంపి స్నూపిని హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్లే క్ర‌మంలో అది మార్గ‌మ‌ధ్య‌ములోనే మరణించింది. తన ప్రాణాలు కాపాడటానికి పెంపుడు శునకం సర్పంతో పోరాడి ప్రాణాలొదిలిందని కిశోర్‌, అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Tags:    

Similar News