నాలుగో రోజు అందని ఆరోగ్యశ్రీ సేవలు..ఇబ్బందులు పడుతోన్న రోగులు

Update: 2019-08-19 06:50 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నాలుగో రోజు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా ప్రభుత్వ హాస్పిటల్స్ కు రోగుల తాకిడి పెరిగింది. ఆరోగ్యశ్రీ కోసం ఉదయం నుంచి క్యూ లైన్స్ లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంలేదంటూ గురువారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేశారు. డిమాండ్‌లు పరిష్కరిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్పష్టం చేశాయి. సేవల నిలిపివేతతో సుదూర ప్రాంతాలు, మారుమూల జిల్లాల నుంచి నిమ్స్‌, గాంధీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Full View 

Tags:    

Similar News