కొత్త గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు

Update: 2019-11-29 13:00 GMT

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త జిల్లాలు, జిల్లాల్లో కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. నూతనంగా ఏర్పడిన కొన్ని గ్రామ పంచాయతీలలో సొంతంగా పంచాయతీ భవనాలు లేవు. దీంతో అద్దె భవనాల్లో పంచాయతీ కార్యాలయ పనులను కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన పంచాయతీ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. అన్ని పంచాయతీలలో ఒక్కసారిగా కాకుండా దశల వారీగా భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ భవనాల నిర్మాణాన్ని రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పథకం కింద నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు.

 గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉండి, లేదా పంచాయతీ భవన నిర్మాణానికి తగిన భూమి ఉండి సొంత భవనాలు లేని గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడి చేశారు. అంతే కాకుండా గ్రామాల్లో ప్రజల రాక పోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. దాంతో పాటు రోడ్లు సరిగ్గా లేని గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు కూడా చేయిస్తామని ఆయన తెలిపారు. ఈ పనులతో పాటు గ్రామాల్లో పర్యావరణాన్ని కాపాడటానికి డంపింగ్ యార్డులను నిర్మింపచేస్తామని ఆయన తెలిపారు. శ్మశాన వాటికలను కూడా గ్రామల్లో త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.



Tags:    

Similar News