నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు

Update: 2019-07-20 06:17 GMT

బిగ్‌బాస్‌ రియాల్టీ షోను వ్యతిరేకిస్తూ.. హీరో అక్కినేని నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్థులు ముట్టడించారు. మహిళలను కించపర్చే విధంగా ఉన్న ఈ రియాల్టీ షోకు.. వ్యాఖ్యాతగా నాగార్జున ఎలా ఉంటారని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా బిగ్‌బాస్‌ షో ఉందంటూ.. స్టూడెంట్స్‌ నిరసన వ్యక్తం చేశారు. దీంతో నాగార్జున ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. వారిని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు. 

Tags:    

Similar News