SLBC Tunnel Collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం
SLBC Tunnel Collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు శనివారం ఉదయం ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్స్: ఎన్ జీ ఆర్ ఐ మార్కింగ్ ప్లేస్‌లో బయటపడ్డ ఐరన్ పైపులు
SLBC Tunnel Collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు శనివారం ఉదయం ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. హైదరాబాద్ నుంచి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్దకు వెళ్లారు. మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మరో ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు.
ఎనిమిది రోజుల క్రితం ఎస్ఎల్ బీ సీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి.టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అత్యాధునిక జీపీఆర్‌లతో గాలిస్తున్నారు. టన్నెల్ లో టీబీఎం ముందు భాగంలో ఐదు అనుమాని లోకేషన్లను రెస్క్యూ టీమ్ గుర్తించింది. ఈ ప్రాంతంలో తవ్వుతున్నారు. ఈ ప్రాంతంలో మట్టిని వెలికితీస్తే కార్మికుల ఆచూకీ తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
టన్నెల్ వద్ద ఎనిమిది అంబులెన్స్ ను సిద్దంగా ఉంచారు. ఇవాళ సాయంత్రానికి రెస్క్యూ ఆపరేషన్స్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశంలోని అత్యంత నిపుణులైన సిబ్బందిని రప్పించి టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.