ఈ ఏడాది చేపమందు పంపిణీపై క్లారిటీ.. వదంతులు నమ్మవద్దు..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదం(మందు) పంపిణీపై స్పష్టత వచ్చింది.

Update: 2020-05-11 03:40 GMT
Bathini Haranath Goud(File photo)

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదం(మందు) పంపిణీపై స్పష్టత వచ్చింది. కరోనా కారణంగా చేప ప్రసాదాన్ని అందించడం లేదని నిర్వహకులు ప్రకటించారు. ఏటా మృగశిర కార్తె రోజున తమ కుటుంబం వందల సంవత్సరాలుగా ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఉన్నవారికి చేప ప్రసాదం వేస్తోందని బత్తిని హరనాథ్ గౌడ్ అన్నారు.

అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే రక్షణ అని బత్తిని హరనాథ్ గౌడ్ అన్నారు. ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది తమ చేప మందు కోసం హైదరాబాద్ వస్తుంటారని.. ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావద్దని విజ్ఞప్తి చేశారు.తే కరోనా కారణంగా ఈ ఏడాది చేప మందు పంపిణీ వేయడం లేదని తెలిపారు. చేప మందు పంపిణీ చేస్తున్నామని ఎవరైనా ప్రకటిస్తే నమ్మొద్దని హరనాథ్ గౌడ్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News