Musi River: మూసీకి భారీగా జంట జలాశయాల నుంచి పోటెత్తుతున్న వరద

Musi River: మూసీలో వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనాలను మళ్లించారు.

Update: 2023-09-06 14:32 GMT

Musi River: మూసీకి భారీగా జంట జలాశయాల నుంచి పోటెత్తుతున్న వరద

Musi River: గత కొన్ని రోజులుగా తెలంగాణలో కురిసిన వర్షాలతో మూసీకి భారీగా వరద పోటెత్తింది. దీంతో మూసీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. హైదరాబాద్‌ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి మూసీ నదిలోకి వరద పోటెత్తింది. అటు.. హైదరాబాద్‌ నగరమంతటా వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం మొత్తం అతలాకుతలం అయిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాలాలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు మూసీకి వరద పోటెత్తడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. చాదర్‌ఘాట్‌, మూసీలో లెవల్ బ్రిడ్జ్‌లను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు.

మూసీలో వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనాలను మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News