MLC Kaushik Reddy: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. బైకర్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
MLC Kaushik Reddy: దశాబ్ది ఉత్సవాల కోసం హుజురాబాద్‌కు వెళ్తుండగా ఘటన
MLC Kaushik Reddy: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. బైకర్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
MLC Kaushik Reddy: కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హుజురాబాద్ లో నిర్వహిస్తున్న 2K రన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ సమీపానికి రాగానే కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి బైక్ అడ్డురావడంతో బైక్ ను తప్పించబోయి ఫార్చూనర్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఏయిర్ బెలూన్ లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పింది. అక్కడి నుండి కౌశిక్ రెడ్డి మరో కారులో హుజురాబాద్ కు బయలు దేరగా, బైక్ మీద వెళ్తూ గాయపడ్డ రైతును 108లో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు.