అధ్యక్షా! వేసవి వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిలిపివేయాలి! తెలంగాణా అసెంబ్లీలో ఎమ్మెల్యే వినతి!

Update: 2020-03-12 18:25 GMT
mla manchireddy kishan reddy in telangana assembly

కరోనా వైరస్ గురించి అందరిలో రకరకాల భయం ఉంది.  వైరస్ వ్యాప్తి గురించి అందరూ ఆందోళన చెందుతున్న సమయం ఇది. ఈ నేపధ్యంలో తెలంగాణా అసెంబ్లీలో గురువారం కొంత సేపు నవ్వులు వెల్లివిరిశాయి. అసెంబ్లీ సమావేశాల జీరో అవర్ లో  ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కరోనా విషయంలో చేసిన సూచన అందర్నీ నవ్వించింది. 

కరోన వైరస్ ప్రబలంగా ఉన్న నేపధ్యంలో హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపు చేయాలని అయన కోరారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు అనే కారణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు పోలీసులు నిర్వహిస్తారానీ, అయితే ఆ సమయంలో ఒకటికి రెండు సార్లు ఆ బ్రీథ్ ఏనాలైజర్లను వాడుతుండడం వలన కరోనా వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారనీ ఆయన చెప్పారు. వేసవి కాలం వచ్చే వరకూ ఈ తనిఖీలు ఆపు చేస్తే బాగుంటుoదంటూ ఆయన చెప్పారు. దీంతో అసెంబ్లీలో నవ్వులు వెల్లివిరిశాయి. దీనికి మంత్రి ఈటెల రాజేంద్ర సమాధానమిస్తూ గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నామనీ సానుకూలంగా ఈ విషయం పై నిర్ణయం తీసుకున్తామనీ వివరించారు.

నిజానికి ఈ తనిఖీల పై గతంలోనూ అభ్యంతరాలు ప్రజల నుంచి వచ్చాయి. అయితే పోలీసు శాఖ మాత్రం ఈ విషయంలో అంత ఇబ్బంది లేదని అప్పట్లో చెప్పింది. ఈ తనిఖీల కోసం ఉపయోగిస్తున్న యంత్రాల తో గాలిని లోపలి పీలుస్తారు తప్ప బయటకు వదలరనీ.. అందువలన అంత ప్రమాదం లేదనీ పోలీసులు చెప్పారు. గతంలో స్విన్ ఫ్లూ విజ్రుమ్భించిన సమయంలో ఇదే డిమాండ్ వచ్చిన సందర్భంలో ఈ యంత్రాల పనితీరుపై సమీక్షించినట్టు తెలిపారు. ఈ యంత్రాల వాళ్ళ ప్రమాదం లేదని తెలిసినట్టు అప్పట్లో వివరించారు.

 అయితే, బెంగళూరులో చాలా కాలం క్రితం నుంచే అక్కడి ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణా అసెంబ్లీ లోనే ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో తాత్కాలికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిలుపుదల చేస్తారని భావించవచ్చు. 

Tags:    

Similar News