ఆటో డ్రైవర్లందరికి పారదర్శకంగా లైసెన్స్‌లు : హరీష్ రావు

ఆటో డ్రైవర్లకు రూపాయి ఖర్చు వృధా కాకుండా అత్యంత పారదర్శకంగా లైసెన్సులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించి ఆటో డ్రైవర్ల సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు.

Update: 2019-08-28 00:44 GMT

ఆటో డ్రైవర్లకు రూపాయి ఖర్చు వృధా కాకుండా అత్యంత పారదర్శకంగా లైసెన్సులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించి ఆటో డ్రైవర్ల సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. డ్రైవర్లు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడడం తగ్గించాలని కోరారు. ఆటో డ్రైవర్లు ఆత్మగౌరవంతో బతుకుతున్నందున..ఖచ్చితంగా ఖాకీ చొక్కా ధరించాలని సూచించారు.సిద్ధిపేట అన్నింటిలోనూ ఆదర్శంగా నిలుస్తోందని అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని అన్నారు. సిద్ధిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ కోసం 300 గజాల స్థలం ఇప్పిస్తానని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారి కోసం రూ. 5 లక్షల బీమా అందించేలా చూస్తామన్నారు.

Tags:    

Similar News