సీఎం కేసీఆర్‌కు కొండాయి వరద పరిస్థితిని వివరించిన మంత్రి సత్యవతి.. సహాయక చర్యలకు ఆదేశించిన సీఎం
CM KCR: కొండాయిలో సహాయక చర్యలకు ఆదేశించిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్‌కు కొండాయి వరద పరిస్థితిని వివరించిన మంత్రి సత్యవతి.. సహాయక చర్యలకు ఆదేశించిన సీఎం
CM KCR: వరద సహాయం కోసం హెలికాప్టర్ ములుగు జిల్లా కొండాయికి బయల్దేరాయి. సీఎం కేసీఆర్‌కు కొండాయి వరద పరిస్థితిని మంత్రి సత్యవతి వివరించారు. కొండాయిలో సహాయక చర్యలకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో మంత్రి సత్యవతి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండాయి గ్రామం వరద ముంపులో చిక్కుకుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు ఆటంకం కలిగిన నేపథ్యంలో సీఎం ఆదేశం మేరకు హెలికాప్టర్‌ను పంపించారు.