లాక్‌డౌన్‌ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య : కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్ అకౌంట్ లో ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Update: 2020-03-23 13:52 GMT
KTR (File Photo)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్ అకౌంట్ లో ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉందో తెలుసుకోవాని కేటీఆర్‌ అన్నారు.

లాక్‌డౌన్‌ అనే చర్యను రాష్ట్ర ప్రభుత్వం అసలు సమర్ధించదని, కనీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా అరుదుగా తీసుకునే చర్యను అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. నువ్వు బ్రతకడానికి, తోటి వారికి బ్రతికే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ వైరస్‌ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఇక కరోనా వైరస్ కట్టడి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని జిల్లాలకు లాక్ డౌన్ ప్రకటించింది.ఈ నెల 31 వరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ పాటించాలని ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఎం వెల్లడించారు. ఆదివారం ఏ విధంగానైతే ప్రజలు కర్ఫ్యూ పాటించారో అదే విధంగా పాటించాలని తెలిపారు.

ప్రజలెవరూ రోడ్లపై తిరగవద్దని, స్వీయ నిర్భంధంలో ఉండాలని తెలిపారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. సామాజిక దూరం పాటించాలని కోరారు. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు సోకినట్లయితే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. లాక్ డౌన్ చేసిన జిల్లాలో తెల్ల రాషన్ కార్డు దారులకు రూ.1,500 ఇస్తామని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి వెల్లాలన్నారు.



Tags:    

Similar News