Minister KTR: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ ఆక్షేపనీయం
Minister KTR: అయోమయానికి గురిచేసే కుటిల ప్రయత్నం బీజేపీ చేస్తోంది
Minister KTR: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ ఆక్షేపనీయం
Minister KTR: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో తార్కాణం అన్నారు. ఎలక్షన్ కమిషన్‌పై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కన్పిస్తుందని కారు గుర్తును పోలిన గుర్తులతో ఓటర్లను అయోమయానికి గురిచేసే కుటిల ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీపైన ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.