ప్రతి సోమవారం చేనేత దుస్తుల్నే ధరిస్తున్నాం: కేటీఆర్

Update: 2019-09-23 09:42 GMT

బతుకమ్మ తెలంగాణకు మాత్రమే పరిమితమైన పండుగన్నారు మంత్రి కేటీఆర్. నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఆడపడుచులకు కేసీఆర్ బతుకమ్మ చీరలను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో స్కూల్ యూనిఫామ్‌లు, బతుకమ్మ చీరల తయారీని సైతం ప్రభుత్వం వారికే ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో సింగరేణి, ఆర్టీసీ కార్మికుల యూనిఫామ్‌ల తయారీని నేతన్నలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టెక్స్‌టైల్స్, వీవర్స్ పార్కులను నిర్మిస్తున్నామన్న ఆయన ప్రతి సోమవారం చేనేత వస్త్రాలే ధరించాలని పిలుపునిచ్చి ఆచరిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.

Tags:    

Similar News