Minister KTR: ఎన్డీఆర్‌ఎఫ్‌కు.. ఎస్డీఆర్‌ఎఫ్‌కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రి
KTR: కిషన్‌రెడ్డి తప్పుడు లెక్కలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు
Minister KTR: ఎన్డీఆర్‌ఎఫ్‌కు.. ఎస్డీఆర్‌ఎఫ్‌కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రి
Minister KTR: ఎన్డీఆర్‌ఎఫ్‌కు.. ఎస్డీఆర్‌ఎఫ్‌కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం దురదృష్టకరమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్‌రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడతున్నారని చురకలంటించారు. కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా హక్కుగా దక్కే ఎస్డీఆర్‌ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్‌రెడ్డి ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తు లేకుండా ఎస్డీఆర్‌ఎఫ్ నిధులు వస్తాయన్న ఆయన. వీటిని తాము ప్రత్యేకంగా ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. కిషన్ రెడ్డి చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి తెలంగాణకు దక్కిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.