KTR: రైతులను ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్
KTR: తెలంగాణ రైతులపై కాంగ్రెస్, బీజేపీకి కక్ష
KTR: రైతులను ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్
KTR: తెలంగాణ రైతులపై కాంగ్రెస్, బీజేపీ కక్ష పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకత మరోసారి బయటపడిందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు పథకాన్ని అడ్డుకుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతుల నోటికాడ కూడును కాంగ్రెస్ లాక్కుందని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పింది.. బీజేపీ రైతుబంధు ఆపేసిందన్నారు. కాంగ్రెస్ కావాలో.. కరెంట్ కావాలో తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.