ఎవ్వరూ అధైర్యపడొద్దు : మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నవేళ తెలంగాణ మంత్రి హరీరావు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని మయూరినగర్ కు వెల్లారు.

Update: 2020-04-06 05:48 GMT
Harish Rao

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నవేళ తెలంగాణ మంత్రి హరీరావు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని మయూరినగర్ కు వెల్లారు. ఆ గ్రామంలో కరోనా వచ్చిన పరిసరాలు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులను కరోనా సోకిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర కుటుంబ సభ్యులను, కరోనా సోకిన వ్యక్తులు ఎవరితో సన్నిహితంగా ఉన్నారో వారికి అలాగే వారి ఇంట్లో పనిచేసే పనిమనిషులను క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు. వారి నమూనాలను తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసారు. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, కరోనా అనుమానితులు ఉంటే తక్షణమే అధికారులకు కానీ లేదా 104 కు పోన్ చేసి సమాచారం తెలపాలని ఆయన ప్రజలను కోరారు.

కరోనా రాకుండా ప్రభుత్వం రక్షణ చర్యలను ముమ్మరం చేశారని ఆయన అన్నారు. ఎవ్వరూ కూడా ప్రభుత్వం ముందు అధరైపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు బయటికి రాకుండా ఉండేందుకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ప్రజలు ఇంటి ముందే పంపించే ఏర్పాట్లు చేస్తున్నాని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఎవరూ బయటకు రాకుండా వ్యాధిని తరిమికొట్టే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.

జిల్లాలోని అన్ని కాలనీల్లోని ప్రజలకు వైద్య పరీక్షలు అందించేందుకు ఆదేశాలు జారీ చేసామని తెలిపారు. ప్రజలు బయటికి వెళ్లకుండా కట్టుదిట్టం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు మూడు చోట్ల చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశాం. కరోనా లక్షణాలు కలిగి ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నామని, పాజిటివ్ వస్తే వెంటనే కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేతో పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి హరీశ్ రావుతో పాటు ఎంపీ.కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి ఉన్నారు.


Tags:    

Similar News