అ వార్తలన్నీ అవాస్తవం... మెట్రో రైలు ఎండీ వివరణ ..

Update: 2019-07-27 11:37 GMT

హైదరబాద్ లోని మెట్రో రైలు మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్‌ కు వెళ్తున్న సమయంలో అనుకోకుండా పక్క ట్రాక్‌లో ప్రయాణించిందని దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పిందని వచ్చిన వార్తలపై మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఖండించారు. అ వార్తలన్నీ అవాస్తవమని పుర్తి వివరాలు తెలియకుండా వార్తలను ప్రచారం చేయొద్దని అయన చెప్పుకొచ్చారు . ఈ రోజు మధ్యాహ్నం సమయంలో గాలుల ధాటికి ట్రాక్‌కు అడ్డంగా ఓ రాడ్‌ పడిపోవడంతో ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్న రైలు అసెంబ్లీ స్టేషన్‌ దాటి లక్డికాపూల్‌ వద్దకు రాగానే నిలిపివేశారు. దీనితో పైన ఉన్న బ్యాటరీ పవర్‌తో రైలును రివర్స్‌ తీసుకెళ్లి మళ్లీ అసెంబ్లీ స్టేషన్‌ వద్ద నిలిపారు. లక్డికాపూల్‌ స్టేషన్‌కు ముందు రైలు ఆగిపోగా అందులో ఓ ఆస్తమా పేషెంట్‌ ఉండటంతో బ్యాటరీ పవర్‌తో ఆ రైలును వెనక్కి తీసుకెళ్లి అసెంబ్లీ స్టేషన్‌ వద్ద ఆపారు. దీనిని సోషల్ మీడియాలో మాత్రం రైలుకి తప్పినా ముప్పు అని ప్రచారం చేసారని అయన చెప్పుకొచ్చారు .  

Tags:    

Similar News