Sammakka Saralamma Prasadam: మేడారం వెళ్లలేకపోతున్నారా? చింత వద్దు.. ఇంటికే అమ్మవార్ల ప్రసాదం! ఆర్టీసీ బంపర్ ఆఫర్
Sammakka Saralamma Prasadam: మేడారం వెళ్లలేని భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త! కేవలం రూ. 299 చెల్లిస్తే సమ్మక్క-సారలమ్మ ప్రసాదం నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఈ కిట్‌లో ఏముంటుంది? ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Sammakka Saralamma Prasadam: మేడారం వెళ్లలేకపోతున్నారా? చింత వద్దు.. ఇంటికే అమ్మవార్ల ప్రసాదం! ఆర్టీసీ బంపర్ ఆఫర్
Sammakka Saralamma Prasadam: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, రద్దీ కారణంగా లేదా ఇతర కారణాలతో మేడారం వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.
రూ. 299లకే ఇంటి వద్దకే ప్రసాదం
దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటి వద్దకే చేరవేసే బాధ్యతను తీసుకుంది. కేవలం రూ. 299 చెల్లించి భక్తులు ఈ సేవను పొందవచ్చు.
ప్రసాదం కిట్‌లో ఏముంటుంది? ఆర్టీసీ అందజేసే ఈ పవిత్ర కిట్‌లో కింది వస్తువులు ఉంటాయి:
♦ అమ్మవార్ల ప్రసాదం (ప్యాకెట్)
♦ సమ్మక్క-సారలమ్మల చిత్రపటం
♦ పసుపు, కుంకుమ
♦ బంగారం (బెల్లం) - మేడారంలో అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టే బెల్లం.
బుకింగ్ చేసుకోవడం ఎలా?
ఆసక్తి గల భక్తులు రెండు పద్ధతుల్లో ఈ ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు:
♦ ఆన్‌లైన్ బుకింగ్: ఆర్టీసీ అధికారిక లాజిస్టిక్స్ వెబ్‌సైట్ www.tgsrtclogistics.co.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.
♦ నేరుగా బుకింగ్: మీ సమీపంలోని టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లకు వెళ్లి పేరు నమోదు చేసుకోవచ్చు.
సందేహాల కోసం కాల్ సెంటర్ నంబర్లు:
ప్రసాదం బుకింగ్ లేదా డెలివరీకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే భక్తులు కింది నంబర్లను సంప్రదించవచ్చు:
♦ 040 69440069
♦ 040 23450033
ప్రస్తుతం మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతోంది. మేడారం వెళ్లలేని వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరుతున్నారు.