మొక్కే కదా అని పీకేశారో బుక్కైపోతారు

మొక్కలంటే అతనికి ప్రాణం కన్న బిడ్డలా దానిని చూసుకుంటాడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు దానికి ఎవరైనా హాని చేస్తే వారి అంతు చూస్తాడు.

Update: 2019-08-22 12:50 GMT

మొక్కలంటే అతనికి ప్రాణం కన్న బిడ్డలా దానిని చూసుకుంటాడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు దానికి ఎవరైనా హాని చేస్తే వారి అంతు చూస్తాడు. ఎక్కడున్నా వెతికి పట్టుకొని జరిమానా విధిస్తాడు అసలు చెట్టేంటి..? జరిమానా ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట ప్రధాన ద్వారం గుండూ ఉండే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే హరీశరావు వీటిని సంరక్షంచే బాధ్యతను సెరికల్చర్ ఆఫీసరా సాముల ఐలయ్యను నిమయించారు. ఐలయ్య వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తూ అందని మన్ననలూ అందుకుంటున్నారు.

ప్రతి రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి సిద్ధిపేటలో మొక్కల సంరక్షణ చూసుకుంటారు అయితే ఇటీవల సిద్ధిపేటలో ఓ షాపు ముందు ఉన్న మొక్కను ఎవరో నరికేసారు. ఈ విషయం తెలుసుకున్న ఐలయ్య మొక్క ఎవరు నరికారో తెలుసుకునే పనిలో పడ్డాడు ఎదురుగా ఉన్న మరో షాపుకి ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నాడు. షాపుకి అడ్డంగా ఉందని యజమానే దానిని నరికేసినట్లు తెలుసుకొని అతనిపై వీడియో ఆధారంగా కేసు పెట్టాడు.

ఓ మొక్కను ధ్వంసం చేసిన కేసులో ఐలయ్య గతంలో ఓ వ్యక్తికి 12వందల జరిమానా కూడా విధించేలా చేశాడు. మొక్కలు అంటే ఎందుకంత ఇష్టం అని ఎవరైనా అడిగితే మొక్కలంటే తనకు ప్రాణమని వాటిని తన కన్న పిల్లల్లా చూసుకుంటానంటున్నాడు. అంతే కాదు నా ప్రాణం ఉన్నంత వరకు మొక్కలను కాపాడుకుంటానని చెబుతున్నాడు ఐలయ్య. ఇప్పటి వరకూ ఐలయ్య దాదాపు 2 లక్షల మొక్కలను నాటాడు సిద్ధిపేటలో ఎవరైనా చెట్లకు హాని చేస్టున్నట్లు తన దృష్టికి వస్తే ఇక అంతే సంగతులు. మొత్తం మీద మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్న ఐలయ్యకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News