దిశను మార్చుకున్న మిడతల దండు..

Update: 2020-06-04 07:36 GMT

ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా భారత దేశానికి చేరకున్న మిడతలు కొద్ది నెలలుగా ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలకు విస్తరించాయి. వాటిని ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు నియంత్రించలేక పోవడంతో అవి పంటలకు నష్టం కలిగించాయి. భారతీయులు పండించుకునే పంటలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నాయి. అది చూసిన రైతులు తమ పంట తమకు కాకుండా పోతుందని లబోదిబో మంటున్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలకు చేరుకున్న మిడతలు తెలుగు రాష్ట్రాల్లో కూడా చొరబడి పంటలను నష్టపరుస్తాయని అధికారులు అనుకుంటున్నప్పటికీ నిసర్గ్ తుపాను కారణంగా ఆ గాలుల ప్రభావానికి అవి వాటి దిశను మార్చుకున్నాయి. విపరీతంగా వీస్తున్న ఈదురు గాలుల ప్రభావానికి మిడతల సమూహం నాగ్‌పూర్, రాంటెక్ మీదుగా మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లవైపు పయనించినట్టు అధికారులు గుర్తించారు.

ఇక మహారాష్ట్రకు చేరుకున్న మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి చేరుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వాటి నివారణ కోసం ప్రభుత్వం నియమించిన అధికారుల ప్రత్యేక బృందం ఐదు రోజులుగా రామగుండం కేంద్రంగా పర్యవేక్షిస్తోంది. కుమురంభీం, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించింది. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పర్యటన నిన్నటితో ముగియగా, ప్రయోగం కోసం కొన్ని మిడతలను ఈ బృందం తీసుకెళ్లింది.


Tags:    

Similar News