Nirmal Rural: దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు: కలెక్టర్

Update: 2020-04-21 12:41 GMT
Special Helpline center

నిర్మల్: కరోనా వైరస్ అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున... దివ్యాంగులు వయోవృద్ధులకు వారి వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. మంగళవారం కలెక్టర్ చాంబర్ లో దివ్యాంగుల, వయోవృద్ధుల టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని తెలిపారు.

లాక్ డౌన్ సందర్భంగా దివ్యాంగులకు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు... వారి నిర్దిష్ట అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. దివ్యాంగులు 1800-572-8980, వయోవృద్ధులు 14567 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని... టోల్ ఫ్రీ నెంబర్ లు ప్రతిరోజు ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 7.00 వరకు అందుబాటులో ఉంటయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా పిల్లల, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జి రాజ్ గోపాల్ పాల్గొన్నారు.

 

Tags:    

Similar News