మూడు రోజుల్లో 6.4లక్షల ఫోన్‌ కాల్స్‌

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.

Update: 2020-03-31 13:24 GMT
Mahender Reddy (File Photo)

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారు 100కు డయల్ చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. దీంతో తెలంగాణలో డయల్ 100కు ఫోన్ కాల్స్ పెరిగిపోయాయి. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే సుమారుగా 6.4లక్షల ఫోన్ కాల్స్‌ వచ్చాయని ఆయన చెప్పారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని కాల్స్ రావడం ఇదే మొదటి సారి అని ఆయన వెల్లడించారు. తమ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం లేదంటూ ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు.

లాక్‌డౌన్‌లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారని కొందరు ఫిర్యాదు చేసారు. అలాగే రవాణా సమస్యలు, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు నిత్యావసరల ధరలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఎక్కువగా ఫిర్యాదులు నమోదయ్యాని తెలిపారు. అంతే కాక కొంత మంది కరోనా అనుమానితుల సమాచారం ఇచ్చారన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు ఈ సమయంలో ఇంటికి పరిమితం కావడమే మనముందున్న సమస్యకు పరిష్కారం అని చెప్పారు. నివారణ లేని కరోనాను నియంత్రించడం ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రెగ్నెంట్ మహిళలు, సీనియర్ సిటిజెన్స్ కోసం, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు 9490617440, 9490617431 కరోనా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని, లేదా covidcontrol@gmail.com ఈ మెయిల్ చేయవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

Tags:    

Similar News