Wine Shop Tenders: తెలంగాణలో లక్ష దాటిన మద్యం టెండర్లు

Wine Shop Tenders: 2,620 మద్యం దుకాణాల్లో 756 దుకాణాలకు రిజర్వేషన్

Update: 2023-08-19 02:34 GMT

Wine Shop Tenders: తెలంగాణలో లక్ష దాటిన మద్యం టెండర్లు

Wine Shop Tenders: తెలంగాణలో మద్యం టెండర్లకు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్లు లక్ష దాటాయి. లక్షా 5 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి. శంషాబాద్, సరూర్ నగర్ లో అత్యధిక టెండర్లు నమోదు కాగా.. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా మద్యం టెండర్లు దాఖలయ్యాయి. వికారాబాద్ లో ఓ వ్యక్తి సిండికేట్ అయ్యి 999 దరఖాస్తులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 6వేలకు పైగా దరఖాస్తులు అందాయి. అలాగే.. హైదరాబాద్ నగర శివారులో ఏపీకి చెందిన వ్యక్తులు భారీగా మద్యం టెండర్లు వేసినట్టు సమాచారం. డీడీలు తీసుకుని సబ్మిట్ చేసినవారికి టోకెన్లు జారీ చేశారు. ఇక.. అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న మద్యం టెండర్లకు డ్రా ప్రక్రియ జరగనుంది.

డ్రాద్వారా గౌడ కులస్తులకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను రిజర్వు చేశారు. ఈ మూడు కేటగిరీల్లో756 దుకాణాలను కేటాయించారు. మిగిలిన 1864 దుకాణాలను ఓపెన్ కేటగిరీకింద, లక్కీడిప్ ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. మద్యం టెండర్లకు భారీ స్పందన రావడంతో అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఊహించినదానికంటే అదనంగా ఆదాయం సమకూరినట్టు సమాచారం.

Tags:    

Similar News