Medak: జనతా కర్ఫ్యూ లో మనందరం పాల్గొందాం: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

Update: 2020-03-21 14:53 GMT
Padma Devender Reddy

మెదక్: దేశంలో, రాష్ట్రంలో కరోనా నివారణ దృష్ట్యా ప్రదానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ల పిలుపు మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా, ఆదివారం రోజున మెదక్ నియోజకవర్గ ప్రజలంతా, స్వచ్చందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉదయం 7.00 గం.ల నుండి రాత్రి 9.00 గం.ల వరకు, ప్రజలంతా ఇండ్లనుండి భయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలన్నారు.. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత తోనే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చునని, ప్రజలంతా బాద్యతగా వ్యవహరించాలన్నారు. ఆదివారం అందరూ స్వచ్చందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని, ఆదివారం ఒక్కరోజు భయటకు రాకుండా ఉండటం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టువచ్చునన్నారు. రా

ష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తించకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ప్రజలు కూడా నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విన్నవించారు.


Tags:    

Similar News