కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్‌...కేటీఆర్ సూచనలు..

Update: 2020-04-28 12:00 GMT

అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరో రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కేటాయించాలని కోరారు. ఐటి, అనుబంధ పరిశ్రమల పరిస్థితుల పైన మార్గదర్శనం చేసేందుకు జాతీయ స్ధాయిలో ఒక స్ట్రాటజీ గ్రూపుని ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని యంయస్ యంఈ పరిశ్రమలకు పలు మినహాయింపులు ఇవ్వాలన్నారు. వివిధ రంగాల కన్వర్జెన్స్ ద్వారా అనేక నూతన అవకాశాలు రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగిందని, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల వలన నూతన ఉపాధి అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదలాలని కేటీఆర్ సూచించారు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేటీఆర్ సూచనలకు సానుకూలంగా స్పందించారు.

Tags:    

Similar News