స్పీకర్ కు రాజీనామా పత్రం అందజేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy: రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారన్న రాజగోపాల్ రెడ్డి
స్పీకర్ కు రాజీనామా పత్రం అందజేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజీనామా పత్రం అందజేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారని అయితే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. తన రాజీనామాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తారనే నమ్మకం ఉందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.