Komaram Bheem Project: డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కొమురంభీం ప్రాజెక్టు.. 9 గేట్లు ఎత్తివేత
Komaram Bheem Project: కొమురంభీం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 42,779 క్యూసెక్కులు
Komaram Bheem Project: డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కొమురంభీం ప్రాజెక్టు.. 9 గేట్లు ఎత్తివేత
Komaram Bheem Project: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురం భీం ప్రాజెక్ట్ డేంజర్ బెల్ మోగిస్తోంది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో 9 గేట్లు ఎత్తి దిగువ పెద్ద వాగులోకి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో కిరిడీ, ఇందానీ, తేజా పూర్, గట్ జనగాo గ్రామాలతో పాటు మరో 4 గ్రామాలను వరద చుట్టేసింది. కొమురం భీం ప్రాజెక్ట్ దగ్గర 42వేల 779 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. 44వేల 37 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.