గాలివానతో కుప్పకూలిన మామిడి మార్కెట్‌

అకాల వర్షం, గాలి బీభత్సానికి రంగారెడ్డి జిల్లా కోహెడలోని మామిడి మార్కెట్‌ షెడ్లు కూలిపోయాయి.

Update: 2020-05-05 08:04 GMT
Koheda Market

అకాల వర్షం, గాలి బీభత్సానికి రంగారెడ్డి జిల్లా కోహెడలోని మామిడి మార్కెట్‌ షెడ్లు కూలిపోయాయి. సోమవారం సాయంత్రం కురిసిన గాలివానకు బీభత్సం వాతావరణం చోటుచేసుకుంది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు రేకులన్నీ ఎగిరిపడ్డి, షెడ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కొంత మంది హమాలీలు గాయాలపాలయ్యారు. దీంతో వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మార్కెట్లో సరైన వసతులు లేకపోయినప్పటికీ తరలించడం పట్ల రైతులతో పాటు హమాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ మధ్య కాలంలోనే హైదరాబాదులోని కొత్తపేటలో ఉండే పండ్ల మార్కెట్ ను కోహెడకు తరలించగా, రూ.56 లక్షలతో 4 రేకుల షెడ్లను ఇటీవలే నిర్మించారు. వీటిలో మూడు షెడ్ల రేకులు కొట్టుకుపోగా ఒక షెడ్డు మాత్రం పూర్తిగా కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయానికి సుమారుగా 1000 టన్నుల మామిడి పండ్లు స్టాక్ మార్కెట్లో ఉండగా రూ.1.60 కోట్ల వరకు నష్టం కలిగి ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు తెలి పాయి.

Tags:    

Similar News