Kodanda Reddy: తెలంగాణలో పోలీస్ రాజ్యం
Kodanda Reddy: ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదన్న కోదండరెడ్డి
Kodanda Reddy: తెలంగాణలో పోలీస్ రాజ్యం
Kodanda Reddy: భారీ వర్షాలతో 15 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సీఎం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసమే సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలో చర్చించడానికే క్యాబినెట్ సమావేశం పెట్టారన్నారు. ప్రజలకు ప్రాణ, ధన, పంట నష్టం జరిగినా కేసీఆర్ కు చీమకుట్టినట్టైనా లేదన్నారు. కాగ్రెస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పొల్గొంటున్నారన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. చెరువులన్నీ కబ్జా చేయడం వల్లే వర్షం వస్తే హైదరాబాద్ లో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయన్నారు.