Kishan Reddy: ప్రగతి భవన్, సచివాలయం కట్టుకున్నపుడు.. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు పూర్తిచేయలేకపోయారు?

Kishan Reddy: దమ్ముంటే పేదలకు 50 లక్షల ఇండ్లు కట్టాలి

Update: 2023-07-21 02:15 GMT

Kishan Reddy: ప్రగతి భవన్, సచివాలయం కట్టుకున్నపుడు.. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు పూర్తిచేయలేకపోయారు?

Kishan Reddy: పేదోళ్ల ఓట్లకోసం... కల్లబొల్లికబుర్లతో కాలయాపన చేస్తూ... డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని కేసీఆర్ మోసంచేస్తున్నాడని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ఎందుకు ఆగిపోయాయి, పూర్తయిన ఇండ్లను పేదలకు ఎందుకు ఇవ్వలేదన్న విషయాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తే పోలీసులతో అరెస్టు చేయించి కట్టడి చేశారని కిషన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు.

వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రగతిభవన్, సచివాలయాలు త్వరిత గతిన పూర్తిచేసినపుడు.. పేదోడి ఇంటి పనులను ఎందుకు పూర్తిచేయలేకపోయారని కిషన్ రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే.. 50 లక్షల ఇండ్లు కట్టాలని సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

Tags:    

Similar News