భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని వాగు ఉధృతి.. 8 ఆవులు మృత్యువాత

Bhadradri Kothagudem: జీవనాధారంగా ఉన్న పశువులు మృత్యువాతతో రైతులు కన్నీటి పర్యంత

Update: 2023-07-28 03:13 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని వాగు ఉధృతి.. 8 ఆవులు మృత్యువాత

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఆళ్లపల్లిమండలం రాయిగూడెం వద్ద కిన్నెరసాని వాగు పొంగిపొర్లుతోంది. వరద తాకిడితో పాకలో కట్టిపెట్టిన పశువులు మృత్యువాతపడ్డాయి. రాయపాడు గ్రామానికి చెందిన కృష్ణయ్యకు చెందిన నాలుగు ఆవులు, లాలయ్యకు చెందిన రెండు ఆవులు, సారయ్యకు చెందిన మరో రెండు ఆవులు వరదఉధృతికి ప్రాణాలు కోల్పోయాయి. జీవనాధారంగా ఉన్న పశువులు మృత్యువాతపడటంతో ఆ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags:    

Similar News