Indiramma House: ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్ డేట్.. ఇళ్లు అలా నిర్మిస్తేనే బిల్లులు మంజూరు
Indiramma House: ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్ డేట్.. ఇళ్లు అలా నిర్మిస్తేనే బిల్లులు మంజూరు
Indiramma House: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. మొదటి, రెండో విడతల్లో కలిపి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్టంగా 4.50లక్షల ఇళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో హైదరాబాద్ ను మినహా రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున 562 గ్రామాల్లో 70,122 ఇళ్లను సర్కార్ ఆమోదించింది. 47, 335 మంది లబ్దిదారులకు అనుమతుల ప్రొసిడింగ్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు 17,962 మంది ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోశారు. 6,132 మంది పునాది వరకు పూర్తి చేశారు. ప్రధానంగా ఇంటి నిర్మాణ కొలతలపై లబ్దిదారుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడతలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. తీసుకుంటున్న చర్యల వివరాలను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి గౌతమ్ తెలిపారు. లబ్దిదారులకు పలు సూచనలు చేశారు.
ఇందిరమ్మ ఇళ్లను కచ్చితంగా 400-600 చదరపు అడుగుల మధ్యలోనే నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే రూ. 5 లక్షలతోనే నిర్మాణం పూర్తయ్యేలా ప్రతి మండలంలో నమూనా ఇళ్లు నిర్మించారని గతంలో 650 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. ఇప్పుడు 600 చదరపు అడుగుల వరకు ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు. ఇందులో ఇల్లు విశాలంగా ఉంటుందన్నారు. రెండు పడకగదులు, హాలు, కిచెన్, రెండు బాత్రూమ్స్ వస్తాయని చెప్పారు. మొదటి విడతలో 370 మంది లబ్దిదారులు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పునాది వేసుకున్నారని..వీరికి మరో ఛాన్స్ ఇస్తున్నామన్నారు. 600 చదరపు అడుగులకు కుదించుకుని శ్లాబు వేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తున్నామన్న ఆయన ఇలా చేస్తామని అంగీకార పత్రం ఇస్తే బిల్లులు అందిస్తామని స్పష్టం చేశారు.