KCR: ఎన్నికల ప్రచారంతో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్
KCR: వరుస పర్యటనలతో జోరుమీదున్న గులాబీ బాస్
KCR: ఎన్నికల ప్రచారంతో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్
KCR: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూసుకెళ్తున్నారు. వరుస పర్యటనలతో జోరు మీదున్నారు గులాబీ అధినేత. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో వేగం పెంచారు కేసీఆర్. ప్రతిపక్షాలు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే.. గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధిపై వివరణలు ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ పోటీ చేసే నియోజకవర్గం కావడంతో సీఎం కేసీఆర్ పర్యటనపై అక్కడి నేతల్లో మరింత ఆసక్తి నెలకొంది. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు కలిపి ఒకే సభను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అందులోనూ ముఖ్యంగా వేములవాడ సిట్టింగ్ అభ్యర్థిని మార్చడంతో ఆ స్థానంలో గెలుపు కోసం స్పెషల్ ఫోకస్ పెట్టింది గులాబీ అధిష్టానం. అయితే ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ హైకమాండ్ చల్లబర్చింది. అంతర్గతంగా ఉన్న విభేదాలపై కూడా దృష్టి సారించింది.
ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసారి లక్షకు పైగా మెజారిటీతో పక్కా అంటూ దీమాతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ.. ఏ పార్టీ కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. సిరిపిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ మాత్రం.. ఈసారి ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కదంటోంది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈసారి ఒక లెక్క అన్నట్లు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూనే.. సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు మంత్రి కేటీఆర్. ఇటు సీఎం కేసీఆర్ టూర్ తోనూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు.