మోదీ, అమిత్ షా ఆటిట్యూడ్ మార్చుకోవాలి : కేసీఆర్

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కేసీఆర్ విమర్శలు సంధించారు. ప్రధాని మోదీ తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతీసారి. 'తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడుతున్నారు' అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మోదీ ఇకనైనా ఆ మాట వివమించుకోవాలన్నారు. అలాగే అమిత్ షా ఆటిట్యూడ్ మార్చుకోవాలని, ప్రతిసారి కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ అభివర్ణిస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉందన్నారు.

Update: 2019-09-22 09:02 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని.. కొత్తగా మతం పుచ్చుకున్నోడికి నామాలు ఎక్కువ అన్న చందంగా వారి హడావుడి ఉందని ఎద్దేవా చేశారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీనే గనుక వస్తే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు వచ్చి తమను కలిశారని చెప్పారు. రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో వారంతా టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేస్తామని అడిగారాన్నారు. దీని బట్టి టీఆర్ఎస్ పాలన బాగుందో తెలుసుకోవాలన్నారు.

టీఆర్ఎస్ అమలుచేస్తున్న పథకాల స్థానంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుచేస్తారని వాటివల్ల ప్రజలకు ఒరిగేదేమి ఉండదని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం స్థానంలో ఆయుష్మాన్ భారత్, రైతు బంధు స్థానంలో కిసాన్ సమ్మాన్ తీసుకొస్తారని చెప్పారు. రైతు బంధు పథకం కింద తాము ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నామని,కిసాన్ సమ్మాన్ పథకం కింద ఎన్ని ఎకరాలున్నా ఏడాదికి రూ.6వేలు మాత్రమే ఇస్తారని చెప్పారు. అలాగే రైతు భీమా కింద తాము ప్రతీ రైతుకు రూ.5లక్షల భీమా ఇస్తున్నామని,కేంద్ర ప్రభుత్వ భీమా పథకంతో రైతు కుటుంబాలకు ఎక్కువ లబ్ది చేకూరదని అన్నారు.

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కేసీఆర్ విమర్శలు సంధించారు. ప్రధాని మోదీ తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతీసారి. 'తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడుతున్నారు' అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మోదీ ఇకనైనా ఆ మాట వివమించుకోవాలన్నారు. అలాగే అమిత్ షా ఆటిట్యూడ్ మార్చుకోవాలని, ప్రతిసారి కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ అభివర్ణిస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉందన్నారు. ఇక నైనా తెలంగాణ అంశంపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు.

అంతకముందు ద్రవ్య మినియయ బిల్లును సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.  సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగుతందన్నారు. ఉప సర్పంచ్‌లను కలుపుకొని తీసుకుపోవాలని సర్పంచ్‌లను కోరినం. సర్పంచ్‌ల విషయంలో కలెక్టర్‌లకు విశేష అధికారాలు ఇచ్చామన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థల లేకుండా పోయాయని, వీఆర్‌వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తామన్నా. భారత దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన రెవెన్యూ చట్టం తెస్తామన్నారు నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తామని వెల్లడించారు. మేం రైతుల కోసం పనిచేస్తున్నాం‎ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రానివ్వమని... కౌలుదారులను తమ ప్రభుత్వం గుర్తించదని స్పష్టం చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చామని ఈ చట్టం పట్ల కఠినంగా ఉంటామని కేసీఆర్ అన్నారు. ద్రవ్య మినియయ బిల్లు ఆమోదం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Tags:    

Similar News