పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థినులు...ఎందుకో తెలుసా..?

సామాన్యులు ప్రధాని నరేంద్ర మోడీని కలవడం అంటే మాటలు కాదు. ఆయన్ని కలవాలను కున్న వారు ఎన్నో నెలల నుంచి ఆయన అపాయింట్ మెంట్ గురించి వేచిచూస్తూ ఉంటారు.

Update: 2020-03-16 06:28 GMT
Representational Image

సామాన్యులు ప్రధాని నరేంద్ర మోడీని కలవడం అంటే మాటలు కాదు. ఆయన్ని కలవాలను కున్న వారు ఎన్నో నెలల నుంచి ఆయన అపాయింట్ మెంట్ గురించి వేచిచూస్తూ ఉంటారు. కానీ ఇద్దరు విద్యార్థినులు మాత్రం తాము దేశాన్ని ఏలే ప్రధానిని కలవాలన్న తాపత్రయంలో ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే వసతి గ్రుహం నుంచి పారియారు. దోమకొండ మండలం సీతారాంపల్లి శివారులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే వసతిగృహం నుంచి పారియిన ఇద్దరు విద్యార్థినులు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నారన్నారు. వారలో ఒకరిది మాచారెడ్డి మండలం, మరొకరిది రాజంపేట మండలం అని తెలిపారు. ఈ ఇద్దరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి టగ్‌ ఆఫ్‌ వార్‌ జాతీయ క్రీడాకారిణి. ఆమె గతంలో టగ్ ఆఫ్ వార్ జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లింది. ఆ సమయంలో ఆమె ప్రధానిని కలువలేకపోయానని తెలిపింది.

ఇప్పుడు ఆయన్ని కలిసి ఫోటో దిగాలనే ఆలోచన వచ్చింది తెలిపారు. వెంటనే విద్యర్ధినులు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకుని ఇద్దరు విద్యార్థినులు ఆదివారం వేకువజామున చున్నీల సహాయంతో పాఠశాల గోడ దూకి పారిపోయారు. విద్యార్థినులు తప్పిపొయిన సంఘటన సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే బీబీపేట పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడి పోలీసులు సమాచారాన్ని కామారెడ్డి డీఎస్పీకి తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి విద్యార్థినులకు పట్టుకోవాని స్థానికి పోలీసులకు చెప్పారు. వారు స్పందించి విద్యార్థినుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం వారి కదలికలను గమనించి పట్టణంలో వెతికారు. చివరికి వారు సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నారు. దీంతో విద్యార్థినుల తల్లిందండ్రలు ఊపిరి పీల్చుకున్నారు.

సంఘటన జరిగిన వెంటనే స్పందించి పోలీసులను ఎస్పీ శ్వేత అభినందించారు. అనంతరం విద్యార్థినుల తల్లిందండ్రులు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వారు తప్పిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News