కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై బదిలీ వేటు

Update: 2019-12-16 06:44 GMT
సర్ఫరాజ్‌ అహ్మద్‌

కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై బదిలీ వేటు పడింది. నూతన కలెక్టర్‌గా శశాంకను నియమిస్తూ కాసపేట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం గద్వాల్ కలెక్టర్‌గా శశాంక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ సర్ఫరాజ్‌, ఎంపీ బండి సంజయ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు రావడం ఆ వివాదం కాస్తా కలెక్టర్ వర్సెస్ మినిస్టర్‌ గంగుల కమలాకర్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌పై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News