Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్..
Kaleshwaram Commission: ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులను విచారణకు పిలువాలని నిర్ణయం
Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్..
Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రేపటి నుంచి ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనున్నది. ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులను పిలువాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 40కి పైగా ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చి విచారకు పిలువనున్నారు. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లను ప్రశ్నించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుకు చెందిన ఆరుగురు ఇంజనీర్లు కమిషన్ బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. ఇంజనీర్ల విచారణ అనంతరం బ్యూరోకట్స్ ను విచారించనున్నది కమిషన్.
ఈ వారంలోనే ఈఎన్సీలను కమిషన్ విచారణకు పిలువనున్నది. ప్రభుత్వాన్ని సైతం అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ప్లేస్ మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారి చేసింది. కాగ్ రిపోర్టు పై కాగ్ అధికారులను కమిషన్ విచారణకు పిలువనున్నది. కమిషన్ కు అఫిడవిట్ అండ్ తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలకు కమిషన్ సిద్ధమవుతుంది. డైరెక్టుగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టులో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఆలోచన చేస్తుంది. కమిషన్ ఇచ్చే పేర్లు అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫారసు చేసే యోచన ఉంది.