Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేశారు

Telangana: రాజ్ భవన్‌లో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారం

Update: 2023-07-24 02:40 GMT

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేశారు

Telangana: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే చేత గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జారీచేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ నియామక ఉత్తర్వులను కార్యక్రమంలో చదివి విన్పించారు. అనంతరం గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయనను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జారీ చేసిన నియామక ఉత్తర్వును హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సుజన చదివి వినిపించారు.

ప్రమాణం అనంతరం గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు పుష్పగుచ్ఛాలతో ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌, వాణీదేవి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News