IT Raids: నల్గొండ జిల్లాలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఇంటిపై దాడులు

Update: 2023-11-16 05:35 GMT

IT Raids: నల్గొండ జిల్లాలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ రైడ్స్‌ జరగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించారు అధికారులు. 40 బృందాలతో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ సహా నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నల్లమోతు ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి.

నల్లమోతు అనుచరుడు శ్రీధర్‌ నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. శ్రీధర్‌ నివాసంలో తెల్లవారుజామున నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నల్లమోతుకు వ్యాపారాలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పలు పవర్‌ప్లాంట్లలో నల్లమోతు భాస్కర్‌రావు పెట్టుబడులు పెట్టినట్టు వివరాలు సేకరించారు. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ చేసినట్టు నల్లమోతు భాస్కర్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి.

Tags:    

Similar News