మహబూబ్‌నగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
* ఓ ప్రైవేట్ కాలేజీలో ఉరి వేసుకుని బాలరాజు ఆత్మహత్య * 15 రోజుల క్రితమే అనారోగ్యంతో బాలరాజు తల్లి మృతి
Representational Image
తల్లి మృతిని తట్టుకోలేక ఓ విద్యార్థి సూసైడ్‌కు పాల్పడ్డ ఘటన మహబూబ్నగర్ లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోన్న బాలరాజు.. కాలేజీలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 15 రోజుల క్రితం అనారోగ్యంతో బాలరాజు తల్లి మృతిచెందింది. తల్లి మృతుని తట్టుకోలేక మనస్తాపంతో బాలరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు ధన్వాడ మండడలం చర్లపల్లి గ్రామస్తుడిగా గుర్తించారు.