భక్తి పారవశ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

కలియుగం ఏ విధంగా అంతం అవుతుందో అన్న విషయాన్ని కాలజ్ఞానంలో తెలిపిన మహానుభావుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందాంబల కళ్యానోత్సవాన్ని నిర్మల్ పట్టణంలో ఈ రోజు నిర్వహించారు.

Update: 2020-02-09 11:21 GMT

కలియుగం ఏ విధంగా అంతం అవుతుందో అన్న విషయాన్ని కాలజ్ఞానంలో తెలిపిన మహానుభావుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందాంబల కళ్యానోత్సవాన్ని నిర్మల్ పట్టణంలో ఈ రోజు నిర్వహించారు. ఈ ఉత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే జరుగుతుందని తెలిపారు. ఇంతటి విశేషమైన కార్యక్రమానికి హాజరవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేసారు.

అనంతరం సాయిదీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన సాయి పారాయణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకం చేసారు. అనంతరం షిర్డీ సంస్థాన్ వికాస్ మహరాజ్ ప్రవచనాలను విని, సాయిపల్లకి సేవలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్, సాయి దీక్ష సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్, నాయకులు సత్యనారాయణ గౌడ్, దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు మేడారం అపర్ణ ప్రదీప్, నేరెళ్ళ వేణు, నాయకులు ఆకోజి కిషన్, కోటగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News