Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్.. రేవంత్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్?

Indiramma Illu Big Update: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు బిగ్ షాక్. అంతేకాదు నిధుల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 'ఇందిరమ్మ ఇల్లు' మంజూరులో మరింత జాప్యం కానుంది.

Update: 2025-03-15 17:06 GMT

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్.. రేవంత్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్?

Indiramma Illu Big Update: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేడు బిగ్ షాక్‌ తగిలినట్లయింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందిచిన యాప్‌లోనే అర్హులను చేర్చాలని స్పష్టం చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు బ్రేక్ పడింది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 30 లక్షలకు పైగా దరఖాస్తులను స్వీకరించింది.ఖాళీ స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు మంజూరు చేయనుంది. అంతేకాకుండా ఇల్లులేని వారికి ఇల్లు అందజేయనుంది. అయితే ఇందులో 23 లక్షల మంది వరకు అర్హులుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం తాము స్వయంగా తయారు చేసిన యాప్ ద్వారా మాత్రమే సర్వే చేయించాలని ఆదేశించింది. అప్పుడే నిధులు మంజూరు చేస్తానని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈనేపథ్యంలో మళ్లీ ఇందిరా అమ్మ ఇల్లు సర్వే చేయించడం కష్టతరంగా మారింది. ఇప్పటికే ఎన్నో రోజులుగా ప్రక్రియ జరుగుతోంది. అయితే ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతున్న సమయానికి ఇలా కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పడంతో మళ్లీ ఉద్యోగులతో పాటు కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అని ఎదురు చూస్తున్న ప్రజలు కూడా ఛేదు వార్త వినాల్సి వచ్చింది.

ముఖ్యంగా కేంద్రం నుంచి కొన్ని నిధులు విడుదల అయితే మొదటి దశలో డబ్బులు మంజూరు చేయాలని తద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్ ఇచ్చింది.

ప్రధానంగా అనర్హులకు ఇల్లు దక్కకుండా కేవలం అర్హులకు మాత్రమే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో స్పష్టంగా తాము నిర్ణయించిన యాప్ లోనే లబ్ధిదారులను చేర్చాలని ఆదేశించింది. ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా, ఆదాయ పన్ను చెల్లింపు, ద్విచక్ర వాహనాల వివరాలు కూడా నమోదు చేయాలని చెప్పింది. ఈనేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుందో మళ్లీ ఎదురు చూడక తప్పదు.

ఇవన్నీ పూర్తి చేసేసరికి ఇప్పట్లో జరిగే పని కాదు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఐదు లక్షల కేటాయింపులో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇల్లు కట్టుకుంటామనే సహకారం కోసం ఎన్నో లక్షలమంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇది బ్యాడ్ న్యూస్ అయ్యింది.

Tags:    

Similar News