ఉపాధిహామి కూలీలకు గుడ్ న్యూస్: వేసవి భత్యం పెంపు

ఉపాధి హామీ పథకం అంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు, ప్రత్నామ్నాయ అవకాశాలు లేని బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలను, సామాజిక భద్రతను కల్పించడానికి ఉపయోగపడుతుంది.

Update: 2020-02-15 07:57 GMT

ఉపాధి హామీ పథకం అంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు, ప్రత్నామ్నాయ అవకాశాలు లేని బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలను, సామాజిక భద్రతను కల్పించడానికి ఉపయోగపడుతుంది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ప్రాథమికంగా దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పిస్తుంది. దాంతో గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందిస్తుంది. ఆర్థికంగా వారికి ఉన్న సమస్యలను ఎంతో కొంత దూరం చేస్తుంది. అంతే కాదు ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వవలసి వస్తుంది. ఈ ఉపాధి హామీ పనుల కోసం పల్లె ప్రాంతాల్లోని ప్రజలు సమీప కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా గ్రామీణ కూలీల వలసలు తగ్గుముఖం పడుతున్నాయి.

ప్రతి ఏడాది వేసవి కాలం వచ్చిందంటే చాలు గ్రామస్థులు ఉదయాన్నే ఉపాథి పనులకు పయణం అవుతారు. ఈ పనులు దాదాపుగా 100 రోజుల పాటు కొనసాగుతాయి. ఇందుకు గాను ప్రభత్వం మహిళలకు, పురుషులకు వేరు వేరుగా కూలీని అందిస్తారు. ఇకపోతే గతేడాది వరకు ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ప్రత్యేక వేసవి భత్యాన్ని అందించలేదు. కానీ రానున్న వేసవికాలంలో ఉపాధి పనులకు హాజరయ్యే వారికి ప్రత్యేక వేసవి భత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి నెల నుంచి జూన్ వరకు ప్రభుత్వం చేపట్టే ఉపాధి పనులు చేసే కూలీలకు సాధారణ పనులకు కల్పించే వేతనం కంటే కూడా 20 నుంచి 30 శాతం వరకు అధికంగా కూలీ చెల్లించేందుకు చర్యలు తీసుకుంది.

అంతే కాదు ప్రతి ఏడాదికి ఏడాదికి ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో పనిగంటలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా ప్రభుత్వం కరువుభత్యం చెల్లించనుంది. దీంతో గ్రామీనులు మరోసారం లాభాన్ని పొందే అవకాశం వచ్చింది. 

Tags:    

Similar News