Weather Update: 4 రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ..!!
Rain Alert: రానున్న ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ సమయంలో పిడుగులు పడతాయనీ, ఉరుములు, మెరుపులు బాగా వస్తాయని తెలిపింది. గాలివేగం గంటకు 30 నుంచి 50కిలోమీటర్లుగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో 15, 16 తేదీల్లో పిడుగులు పడతాయనీ గాలివేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటూ..సుడిగాలులు గంటకు 70కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయని తెలిపింది. నేడు గుంటూరు కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
తెలంగాణలో నేడు రోజంతా మేఘాలు ఉంటాయి. ఉదయం పూట ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం 10 తర్వాత వర్షండ ఉండదు. తిరిగి రాత్రి 7 తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 వరకు దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
నైరుతీ రుతుపవనాలు వచ్చేందుకు అనుకూల పరిస్థితులు చాలా ఉన్నాయి. కొత్తగా పుట్టిన అల్పపీడనం గందరగోళం చేసినట్లయితే నైరుతీ గాలుల రాకతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆ అల్పపీడనం కొంత నెమ్మదిగానే ఉంటుందంటున్నారు. అది గానీ తుపానుగా మారితే నైరుతీ రుతుపవనాలను అది లాగేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మన దేశానికి నైరుతీ రాక ఆలస్యం అవుతుంది. అల్పపీడనం ఎలా ఉంటందనేది శుక్రవారానికి కొంత తెలిసే అవకాశం ఉంది.