Illegal loan scam in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మరో అక్రమ రుణాల దందా

Illegal loan scam in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మరో అక్రమ రుణాల బాగోతం బయటపడింది. బ్యాంకర్లు, దళారులు కుమ్మక్కై రైతులకు కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ పాస్ పుస్తకాలు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పెద్దఎత్తున రుణాలను కాజేశారు.

Update: 2020-07-25 11:34 GMT
Illegal loan scam in bhodan, Nizamabad district

Illegal loan scam in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మరో అక్రమ రుణాల బాగోతం బయటపడింది. బ్యాంకర్లు, దళారులు కుమ్మక్కై రైతులకు కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ పాస్ పుస్తకాలు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పెద్దఎత్తున రుణాలను కాజేశారు. అయితే, తాము తీసుకోని రుణాలను చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో అక్రమ రుణాల బాగోతం బయటపడింది. ఎలాంటి రుణం తీసుకోకపోయినా, అప్పు కట్టాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. అసలు నోటీసులు వచ్చేవరకు కూడా తమ పేరున అప్పుందనే సంగతి తెలియని అమాయక రైతులు బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. గతంలో ఎడపల్లిలో 2కోట్ల రూపాయల నకిలీ పంట రుణాల బాగోతం మరిచిపోకముందే, ఇప్పుడు బోధన్‌లో అదే తరహా మోసం వెలుగుచూడటంతో రైతులు కంగుతింటున్నారు. తాము తీసుకోని రుణాలను చెల్లించాలంటూ నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు. అయితే, రైతులకు తెలియకుండానే రుణాలు మంజూరు చేయడంపై మాట్లాడేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు.

బోధన్ కేంద్రంగా సాగిన ఈ నకిలీ పంట రుణాల బాగోతంలో పలువురు బ్యాంకర్లు దళారులతో చేతులు కలిపి రైతులకు కుచ్చుటోపీ పెట్టారు. రైతుల భూములను వారికి తెలియకుండానే మార్టిగేట్ చేస్తూ అక్రమాలకు తెరలేపారు. భూముల్లేకపోయినా పంట రుణాలు మంజూరు చేయడం మరణించిన రైతుల పేరిట రుణాలివ్వడం భూమి ఒకరి పేరున ఉంటే మరొకరి పేరున రుణం మంజూరుచేసి మోసానికి పాల్పడ్డారు.

అయితే, పంట రుణాల అక్రమ దందాలో దళారులు, బ్యాంకర్ల ప్రమే‍యంతోపాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది పాత్ర కూడా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. వీళ్ల సహకారం లేనిదే నకిలీ డాక్యుమెంట్లతో రుణాలు మంజూరు చేయడం సాధ్యంకాదంటున్నారు. అయితే, నకిలీ పంట రుణాల బాగోతంపై బాధిత రైతులు ఆందోళనకు సిద్ధమవుతుంటే, మరోవైపు ఈ దందాపై దర్యాప్తు చేస్తే పెద్ద కుంభకోణమే బయటపడుతుందని అంటున్నారు.


Full View


Tags:    

Similar News