తెలంగాణలో 50 మంది ఐఏఎస్‌ల బదిలీ

Update: 2020-02-03 01:18 GMT

తెలంగాణలో భారీగా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. రాత్రి పొద్దుపోయాక ఐఏఎస్‌ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల్లో మార్పులు చేశారు సీఎం కేసీఆర్‌. ఈ జట్టు చూస్తుంటే టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ల బదిలీ జరగడం ఇదే తొలిసారి అని అర్ధమవుతోంది.

21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించగా.. కీలకమైన శాఖల్లో అధికారులను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కీలకమైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హాను ప్రాధాన్యత లేని పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖకు బదిలీ చేసింది. ఇక గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న చిత్రా రామచంద్రన్‌కు విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, సీఎం కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు కేటాయించారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జగదీశ్వర్‌ను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ డి.రొనాల్డ్‌ రాస్‌లను ఆర్థిక శాఖ కార్యదర్శులుగా నియమించింది. మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శిగా దివ్య, సీఎస్‌కు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా అధ్వైత్‌కుమార్‌ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బుర్రా వెంకటేశం, విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శిగా జగదీశ్వర్‌, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా పార్థసారథి లను నియమించింది. మరోవైపు ఏడాదిన్నరగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 16 మంది సబ్‌ కలెక్టర్లకు కూడా పోస్టింగులు ఈసారి పోస్టింగులు లభించాయి. వాందరినీ ఐటీడీఏ పీవోలు, మున్సిపల్‌ కమిషనర్లుగా నియమించింది.

ఇక జిల్లా కలెక్టర్లుగా..

ఆదిలాబాద్‌ ఏ.శ్రీదేవసేన

నారాయణపేట: హరిచందన దాసరి

హైదరాబాద్‌: శ్వేత మహంతి

జయశంకర్‌ భూపాలపల్లి: అబ్దుల్‌ అజీమ్‌

కామారెడ్డి: శరత్‌

భద్రాద్రి కొత్తగూడెం: ఎంవీ రెడ్డి

నల్గొండ: పాటిల్‌ ప్రశాంత్ జీవన్‌

వరంగల్‌ అర్బన్‌: రాజీవ్‌గాంధీ హన్మంతు

మహబూబ్‌నగర్‌: ఎస్‌. వెంకటరావు

సూర్యాపేట: టి.వినయ్‌కృష్ణారెడ్డి

మేడ్చల్‌: వి.వెంకటేశ్వర్లు

నిర్మల్‌: ముషారఫ్‌ అలీ

ములుగు: ఎస్‌కే ఆదిత్యా

మహబూబాబాద్‌: వీపీ గౌతమ్‌

జగిత్యాల: జి.రవి

జనగామ: కె.నిఖిల

వికారాబాద్‌: పసుమి బసూ

జోగులాంబ గద్వాల్‌: శ్రుతి ఓజా

ఆసిఫాబాద్‌: సందీప్‌కుమార్‌ ఝా

పెద్దపల్లి: ఎస్‌.పట్నాయక్‌

వనపర్తి: ఎస్‌కే వై. బాషా

Tags:    

Similar News