Hyderabad Water Supply Alert: నేడు నగరంలో నీటి సరఫరా బంద్.. ఆ ఏరియాల వారు జాగ్రత్త!

హైదరాబాద్‌లో పైప్‌లైన్ మరమ్మత్తుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ, మాధాపూర్ సహా పలు ఏరియాల వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-01-17 08:08 GMT

భాగ్యనగర వాసులకు జలమండలి కీలక సూచన చేసింది. నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్లకు మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా, శనివారం నాడు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

మరమ్మత్తులకు కారణం ఇదే..

సింగూరు ప్రాజెక్టు ఫేజ్-3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడటంతో అధికారులు అత్యవసర మరమ్మత్తులు చేపట్టారు. దీనికి తోడు తెలంగాణ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ నిర్వహణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా నేడు (శనివారం) రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది.

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:

జలమండలి డివిజన్ల వారీగా అంతరాయం ఏర్పడే ఏరియాల జాబితా ఇలా ఉంది:

డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్.

డివిజన్–9: కేపీహెచ్‌బీ (KPHB), బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భరత్ నగర్.

డివిజన్–15: కొండాపూర్, మాధాపూర్, డోయెన్స్ కాలనీ.

డివిజన్–17: గోపాల్ నగర్.

డివిజన్–22: తెల్లాపూర్.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి అధికారులు కోరారు. మరమ్మత్తులు పూర్తి కాగానే నీటి సరఫరాను తిరిగి పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News